
సహజంగా మీ ఇంటికి గానీ, ఆఫీస్‌కి గానీ ఎవరైనా వచ్చినట్లయితే, లేదా మీ ఫోన్ లో వైఫై హాట్ స్పాట్ ఎనేబుల్ చేసి, మీ ఫోన్లో ఉన్న ఇంటర్నెట్ ఇతరులకు షేర్ చేయాలనుకుంటే మన వైఫై పాస్వర్డ్ అవతల వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది కదా! అది గుర్తుపెట్టుకుని చెప్పాల్సిన పని లేకుండా, దాన్ని వారు ఇతరులకు కూడా షేర్ చేయకుండా అడ్డుకోవాలంటే ఒక టెక్నిక్ ఉంది.
ఇటీవల కాలంలో అధిక శాతం smartphoneలలో WiFi Settingsలో QR Code క్రియేట్ చేసుకోవటానికి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిని సెలెక్ట్ చేసుకుంటే మీ వై-ఫై నెట్వర్క్‌కి సంబంధించిన SSIDతో పాటు దాని పాస్వర్డ్ కూడా ఒక QR Code రూపంలో తయారుచేయబడి స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతుంది. దానిని అవతల వారికి చూపిస్తే సరిపోతుంది. లేదా అవతలి వాళ్ళకి షేర్ చేస్తే మీ పాస్వర్డ్ తెలియకపోయినా నేరుగా మీ వై-ఫై నెట్వర్క్‌కి వారు కనెక్ట్ కాగలుగుతారు.
ఒకవేళ మీ ఫోన్లో వైఫై సెట్టింగ్స్ లో కి వెళ్ళినప్పుడు ఇలాంటి ఆప్షన్ అనేది లేకపోతే, QR Code Generator అనే ఆండ్రాయిడ్ అప్లికేషన్ గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని, దాన్ని ఓపెన్ చేసిన తర్వాత Text Box అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని, ఆ వెంటనే వచ్చే స్క్రీన్ లో WiFi అనే ప్రదేశం లోకి వెళ్ళండి. ఇప్పుడు స్క్రీన్ అడుగు భాగంలో కనిపించే బాక్స్‌లలో SSID అనే ఫీల్డ్‌లో మీ వై-ఫై నెట్‌వర్క్ యొక్క పేరు, ఆ క్రిందనే పాస్వర్డ్ అనే ప్రదేశంలో మీ వైఫై పాస్వర్డ్ టైప్ చేయండి. అలాగే సహజంగా అందరూ WPA/WPA2 ఎన్క్రిప్షన్ వాడుతూ ఉంటారు కాబట్టి దానిని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది.
గమనిక: Whatsappలో అన్ని లేటెస్ట్ Tech Updates కోసం
https://chat.whatsapp.com/EfkYnksROukEjBYCSVpelG అనే గ్రూప్‌లో జాయిన్ అవండి.
లేదా గమనిక: Telegramలో వాడేవారు లేటెస్ట్ Tech Updates కోసం
https://t.me/technews_latest అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.
Comments
Post a Comment