సహజంగా మీ ఇంటికి గానీ, ఆఫీస్‌కి గానీ ఎవరైనా వచ్చినట్లయితే, లేదా మీ ఫోన్ లో వైఫై హాట్ స్పాట్ ఎనేబుల్ చేసి, మీ ఫోన్లో ఉన్న ఇంటర్నెట్ ఇతరులకు షేర్ చేయాలనుకుంటే మన వైఫై పాస్వర్డ్ అవతల వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది కదా! అది గుర్తుపెట్టుకుని చెప్పాల్సిన పని లేకుండా, దాన్ని వారు ఇతరులకు కూడా షేర్ చేయకుండా అడ్డుకోవాలంటే ఒక టెక్నిక్ ఉంది. ఇటీవల కాలంలో అధిక శాతం smartphoneలలో WiFi Settingsలో QR Code క్రియేట్ చేసుకోవటానికి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిని సెలెక్ట్ చేసుకుంటే మీ వై-ఫై నెట్వర్క్‌కి సంబంధించిన SSIDతో పాటు దాని పాస్వర్డ్ కూడా ఒక QR Code రూపంలో తయారుచేయబడి స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతుంది. దానిని అవతల వారికి చూపిస్తే సరిపోతుంది. లేదా అవతలి వాళ్ళకి షేర్ చేస్తే మీ పాస్వర్డ్ తెలియకపోయినా నేరుగా మీ వై-ఫై నెట్వర్క్‌కి వారు కనెక్ట్ కాగలుగుతారు. ఒకవేళ మీ ఫోన్లో వైఫై సెట్టింగ్స్ లో కి వెళ్ళినప్పుడు ఇలాంటి ఆప్షన్ అనేది లేకపోతే, QR Code Generator అనే ఆండ్రాయిడ్ అప్లికేషన్ గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని, దాన్ని ఓపెన్ చేసిన తర్వాత Te...
Sanjay Nihaal Blogs offers readers independent thinking, analysis of current affairs and lifestyle topics, stories for children, product reviews, and unboxing videos. A platform to share ideas, start discussions and spread knowledge. Join our community.