Skip to main content

Posts

Showing posts with the label Tesla

Tesla atoms model y మొదటి సారిగా తనను తాను డెలివరీ చేసుకుంది!

తొలిసారిగా పూర్తిస్థాయి అటానమస్ కారు స్వీయ డెలివరీ ఫ్యాక్టరీ నుంచి సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ యజమాని ఇంటికి చేరుకున్న టెస్లా 'మోడల్ వై'.. హైవేపై ట్రాఫిక్ను దాటుకుంటూ, గంటకు గరిష్టంగా 115 కి.మీ. వేగంతో ప్రయాణం 'ఎక్స్' వేదికగా ప్రకటించిన ఎలాన్ మస్క్.. వీడియో నెట్టింట వైరల్ కొత్త తొక్కుతున్న పుంతలు కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీకి సరికొత్త నిదర్శనం ఇది.. సైన్స్ ఫిక్షన్ సినిమాను పోలిన సన్నివేశం ఇది.. ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టిన వస్తువు చిటికెలో డోర్ డెలివరీ అవుతున్నట్లుగా ఒక కొత్త టెస్లా కారు ఫ్యాక్టరీ నుంచి స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ కస్టమర్ ఇంటికి వచ్చేసింది! హైవేపై సాఫీగా మందుకు కదులుతూ.. మధ్యమధ్యలో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఆగుతూ.. గరిష్టంగా 115 కి.మీ. వేగంతో దూసుకెళ్తూ తన కొత్త ఓనర్ ఉన్న లొకేషన్కు భద్రంగా చేరుకుంది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మసకు చెందిన టెస్లా కంపెనీ ప్రపంచంలోనే తొలిసారిగా ఏమాత్రం మానవ ప్రమేయం లేకుండా తమ కొత్త కారును నేరుగా వినియోగదారుడి చెంతకు చేర్చింది. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో నడిచే పూర్తిస్థాయి అటానమస్ కారు 'మోడల్ వై'ను టెక్సాస్ రాష్ట్రంలోని...