Skip to main content

మీ phoneలోని ఫోటోలను ఆటోమేటిక్ గా ఎడిట్ చేయడం కోసం సూపర్ యాప్ వస్తోంది!





మన smartphone  కెమెరా ద్వారా మనం క్యాప్చర్ చేసుకునే ఫోటోలను ఎడిట్ చేయడం కోసం రకరకాల అప్లికేషన్లు గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని వాడుతూ ఉంటాం.
అయితే ప్రముఖ ఫోటో ఎడిటింగ్ సంస్థ Adobe  ఒక శక్తివంతమైన అప్లికేషన్ తీసుకు రాబోతోంది. ఇది మనం క్యాప్చర్ చేసిన ఫోటోలను మన ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా అవసరమైన అడ్జస్ట్మెంట్ లు చేసి మెరుగ్గా కనిపించే విధంగా ఎడిట్ చేస్తుంది. Adobe  సంస్థ డెవలప్ చేసిన Adobe Sensei అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే టెక్నాలజీని ఉపయోగించి ఇది పనిచేస్తుంది.
ఇప్పటికే అడోబ్ ఫోటోషాప్ లేటెస్ట్ వెర్షన్ వాడుతున్న వారికి అందులో Select Subject అనే  ఒక ప్రత్యేకమైన ఫీచర్ ప్రవేశపెట్టబడిన విషయం తెలిసిందే. ఒక ఫోటో లో ఉండే మనకు కావాల్సిన సబ్జెక్ట్ ను చాలా సులభంగా క్షణాల్లో సెలెక్ట్ చేసుకోవడం కోసం ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. గతంలో ఇలా సెలెక్ట్ తీసుకోవాలంటే ఫోటోషాప్ లో ఉండే అనేక టూల్స్‌తో  కుస్తీ పడాల్సి వచ్చేది.
Photoshop Camera అని  పిలవబడే కొత్త అప్లికేషన్ దాదాపు జనవరి 2020 లో ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టం వాడే  యూజర్లకు అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఈ అప్లికేషన్ ఉపయోగించి నేరుగా ఫోటోలను క్యాప్చర్ చేసుకోవచ్చు,  వాటిని ఎడిట్ చేసుకోవచ్చు, అలాగే తలకు షేర్ కూడా చేసుకోవచ్చు. ఇదంతా నేరుగా వ్యూ ఫైండర్ ద్వారా పూర్తి చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది.
ఈ అప్లికేషన్ మీరు షూట్  చేస్తున్న ఫోటోలను ఆటోమేటిక్ గా గుర్తించి,  వాటికి ఆటోమేటిక్ గా డైనమిక్ రేంజ్ అప్లై చేయడం, మొహంలోని  వివిధ భాగాలకు నిర్దిష్టమైన కలర్ టోన్స్ అప్లై చేయడం, అనేక ఇతర అడ్జస్ట్మెంట్ లను చేస్తుంది. అంతేకాదు మీ ఒరిజినల్ ఫోటో చెక్కుచెదరకుండా దాన్ని కూడా అదనంగా ఒక కాపీ గా సేవ్ చేస్తుంది.
గమనిక: Whatsappలో అన్ని లేటెస్ట్ Tech Updates కోసం
https://chat.whatsapp.com/EfkYnksROukEjBYCSVpelG అనే గ్రూప్‌లో జాయిన్ అవండి.
లేదా గమనిక: Telegramలో వాడేవారు లేటెస్ట్ Tech Updates కోసం
https://t.me/technews_latest అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.

Comments

Popular posts from this blog

1Apportunity viralpe Full details in Telugu

⭐ 1APPARTUNITY అంటే ఏమిటి?  ViralPe అనే హైదరాబాద్‌ స్టార్టప్‌ తయారుచేసిన రెండు మొబైల్‌ యాప్‌లలో ఒకటి 1Apportunity. ఇవి రెండు యాప్‌లు: 1. ViralPe App – స్థానిక షాపులు, వ్యాపారాలు కస్టమర్లను పొందడానికి 2. 1Apportunity App – యూజర్లు రోజూ చిన్న చిన్న పనులు చేసి డబ్బు సంపాదించడానికి ఈ యాప్ లక్ష్యం: సోషల్ మీడియా టైంను ఉత్పాదకమైన పనులుగా మార్చడం గ్రామీణ ప్రజలకు డిజిటల్ అవకాశాలు ఇవ్వడం ఉద్యోగ అవకాశాలు సృష్టించడం రిఫరల్ ద్వారా సంపాదించడానికి మార్గాలు ఇవ్వడం --- 🔵 Page 2 – వారు చెప్పిన సమస్యలు ఈ పేజీలో వారు నాలుగు ప్రధాన సమస్య들을 చెప్పారు: 1. Local Vendors కేవలం ఊర్లకే పరిమితం కావడం 70% షాపులు స్థానికంగానే ఉన్నా, ఆన్‌లైన్‌లో కనిపించవు. వాళ్లకు: డిజిటల్ యాప్స్ ఆన్‌లైన్ పేమెంట్స్ డెలివరీ సిస్టమ్స్ ఇవి అందుబాటులో లేవు. 2. దేశంలో ఉద్యోగాల కొరత ఉపాధి తగ్గడం GDP growth తగ్గించే ప్రధాన కారణం. 3. గ్రామీణ డిజిటల్ లిటరసీ తక్కువ గ్రామాల్లో చాలా మంది డిజిటల్ పద్ధతులకు సరిగ్గా అలవాటు కాలేదు. 4. సోషల్ మీడియా అలవాటు వల్ల సరైన పని లేమి మొబైల్ టైమ్ వృథా అవుతోంది. --- 🔵 Page 3 – వారి సొల్యూషన్ ఏమ...

ఇందిరమ్మ ఇల్లు పథకం (Indiramma Illu application status )

ఇందిరమ్మ ఇల్లు పథకం (Indiramma Illu application status )  ** ఇందిరమ్మ ఇల్లు పథకం ** అనేది తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక పథకం. ఇది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే నిరుపేద కుటుంబాలకు బహుళ అంతస్తుల ఇళ్లను అందించడం లక్ష్యంగా పెట్టుకుని రూపొందించిన పథకం. దీని ద్వారా ప్రజలు సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన నివాసాలను పొందవచ్చు. ఈ పథకం ద్వారా నిరుపేద ప్రజలకు మంచి నాణ్యమైన ఇళ్లను అందించడమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగాన్ని తగ్గించడం మరియు ఆర్థిక స్తోమతలను పెంచడం కూడా లక్ష్యం.  ఇప్పటివరకు, తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకం ద్వారా చాలామంది నిరుపేద కుటుంబాలు లబ్ధి పొందాయి మరియు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచుకుంటున్నారు. **ఇందిరమ్మ ఇల్లు పథకం** తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిరుపేద ప్రజల సంక్షేమానికి మద్దతునిచ్చే ముఖ్యమైన కార్యక్రమాలలో ఒకటి.  నిరుపేదలు, అట్టడుగు వర్గాలకు అందుబాటు ధరల్లో ఇళ్లు అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకం.. ఇక్కడ కొన్ని కీలక ఫీచర్లు ఉన్నాయి: 1. **ఆర్...

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి – Direct Link & పూర్తి వివరాలు

ఇంటర్ ఫలితాలు విడుదల TG: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రథమ సంవత్సరం (1st Year), ద్వితీయ సంవత్సరం (2nd Year) పరీక్షల ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కేకే గారు అధికారికంగా విడుదల చేశారు. విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ ఫలితాలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. 📊 మీ ఫలితాలు ఎలా చెక్ చేయాలి? మీ ఇంటర్ ఫలితాలను తెలుసుకోవడానికి క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి: క్రింది ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి మీ Hall Ticket Number నమోదు చేయండి Submit పై క్లిక్ చేయండి మీ ఫలితం స్క్రీన్ పై కనిపిస్తుంది 👉 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: [. click here for results ] 📌 ముఖ్య సమాచారం 1st Year & 2nd Year ఫలితాలు రెండూ అందుబాటులో ఉన్నాయి అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే చెక్ చేయండి ఫలితాలను PDF రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు 🎉 అన్ని విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు! మీ భవిష్యత్తు మరింత విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నాము.