
మీ దగ్గర ఉన్న Android phone నోటిఫికేషన్స్, ఎస్ఎంఎస్ మెసేజ్ లు ఇతర సమాచారం మొత్తాన్ని నేరుగా కంప్యూటర్ స్క్రీన్ మీద పొందటం కోసం అనేక అప్లికేషన్స్ మరియు గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్ కూడా లభిస్తుంది ఆ విషయం తెలిసిందే గూగుల్ కనెక్షన్స్ కూడా లభిస్తున్న విషయం తెలిసిందే.
ఇదే క్రమంలో మైక్రోసాఫ్ట్ సంస్థ windows 10 ఆపరేటింగ్ సిస్టం కోసం Your Phone అనే సదుపాయం కూడా కొంత కాలంగా అందిస్తోంది. దీని ద్వారా మీ ఫోన్లో మన ఫోటోలు, నోటిఫికేషన్స్ నేరుగా పిసిలో వైర్లెస్గా పొందొచ్చు. అయితే ఈ రోజు తాజాగా మైక్రోసాఫ్ట్ సంస్థ Windows Insider programలో భాగంగా ఉన్న వారి కోసం ఒక అద్భుతమైన అప్డేట్ విడుదల చేసింది. దీనిని ఉపయోగించుకొని ఇకమీదట మీరు ఫోన్ చేతిలోకి తీసుకోవలసిన పనిలేకుండా నేరుగా పీసీ నుండి ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు, అలాగే మీకు వచ్చిన ఫోన్ కాల్స్ ఆన్సర్ కూడా చేయొచ్చు.
మీ కంప్యూటర్ లో ఉండే మైక్రోఫోన్ మరియు స్పీకర్ ఆధారంగా వాయిస్ వినిపిస్తుంది. ముఖ్యంగా హెడ్ ఫోన్స్ తగిలించుకొని కంప్యూటర్ లో సీరియస్ గా పనిచేస్తూ కూర్చునేవారు ముఖ్యమైన కాల్స్ మిస్సవకుండా ఉండటం కోసం ఈ సదుపాయం బాగా ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్ 7.0 ఆపరేటింగ్ చేసిన తర్వాత వెర్షన్స్ కలిగి ఉన్న అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ లో ఈ సదుపాయాన్ని పొందవచ్చు
గమనిక: Whatsappలో అన్ని లేటెస్ట్ Tech Updates కోసం
https://chat.whatsapp.com/EfkYnksROukEjBYCSVpelG అనే గ్రూప్‌లో జాయిన్ అవండి.
Comments
Post a Comment