మీ Android phoneలో అప్లికేషన్స్ దాచి పెట్టడం లేదా కంట్రోల్ చేయడం ఎలా?
how to hide apps on android
వివిధ కారణాల వల్ల మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్న అనేక రకాల అప్లికేషన్స్ ఇతరులకు కనిపించకుండా దాచి పెట్టాలి అనుకున్నా గానీ, లేదా సంబంధిత అప్లికేషన్స్ ఓపెన్ కాకుండా బ్లాక్ చేయాలన్నా గానీ అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్నిటి గురించి ఇప్పుడు చూద్దాం.
Calculator Vault
గూగుల్ ప్లే స్టోర్ లో లభించే ఈ అప్లికేషన్ చూడటానికి ఒక మామూలు క్యాలిక్యులేటర్ అప్లికేషన్‌లా కనిపిస్తుంది. అయితే దీంట్లో ఏదైనా అప్లికేషన్ మనం జత చేసినట్లయితే అది ఆటోమేటిగ్గా అదనంగా ఒక కాపీ క్రియేట్ అయ్యి ఇతరులకు కనిపించకుండా దాచి పెట్టబడుతుంది. ఆ తర్వాత బయట పబ్లిక్ గా కనిపిస్తున్న అప్లికేషన్ తొలగించుకోవచ్చు. కేవలం ముందే సెట్ చేసుకున్న పాస్వర్డ్ టైపు చేసిన వారు మాత్రమే ఇందులో హైడ్ చేయబడిన అప్లికేషన్స్ యాక్సెస్ చేయగలుగుతారు. ఈ లింక్ నుండి ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Google Family Link
ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్లను మానిటర్ చేయడం కోసం పేరెంట్స్ కోసం ఉపయోగపడే మంచి అప్లికేషన్ ఇది. గూగుల్
సంస్థ స్వయంగా తయారు చేసిన యాప్ ఇది. దీన్ని ఉపయోగించి చిన్న పిల్లల దగ్గర ఉన్న ఫోన్ లో వారికి తెలియకుండా
రిమోట్గా కొన్ని అప్లికేషన్స్ హైడ్ చేయుచ్చు. అవసరమైనప్పుడు మళ్ళీ అవి బయటకు కనిపించేలా చేయవచ్చు. అంతే కాదు ఇది
చిన్న పిల్లలు ఎక్కువగా ఏ అప్లికేషన్ మీద గడుపుతున్నారు వంటి సమాచారం కూడా మనకు చూపిస్తుంది.
గమనిక: Whatsappలో అన్ని లేటెస్ట్ Tech Updates కోసం
https://chat.whatsapp.com/EfkYnksROukEjBYCSVpelG అనే గ్రూప్‌లో
జాయిన్ అవండి.
లేదా గమనిక: Telegramలో వాడేవారు లేటెస్ట్ Tech Updates కోసం
https://t.me/technews_latest అనే ఛానెల్‌లో
జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.
Digital Wellbeing
ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టం కలిగి ఉన్న అన్ని ఫోన్స్ లో దాదాపు ఈ మధ్య కాలంలో వస్తున్న అప్లికేషన్ ఇది. దీంట్లో
అప్లికేషన్ టైమర్ అనే మాడ్యూల్ ఆధారంగా ఒక అప్లికేషన్ రోజు మొత్తం మీద ఒక నిర్దిష్టమైన సమయం మాత్రమే ఓపెన్ అయ్యే
విధంగా లిమిట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఫోన్లో అఫీషియల్గా ఈ డిజిటల్ వెల్‌బీయింగ్ సదుపాయం లేకపోతే
ActionDash అనే ఆండ్రాయిడ్ అప్లికేషన్ గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని ప్రయత్నించవచ్చు.
అలాగే Nova Launcher వంటి కొన్ని లాంఛర్ అప్లికేషన్స్ లో ఇతరులకు కనిపించకూడదు అనుకున్న కొన్ని నిర్దిష్ట
అప్లికేషన్స్ యాప్ డ్రాయర్ నుండి హైడ్ చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది. సో అలాంటివి కూడా ప్రయత్నించవచ్చు.
Comments
Post a Comment