
Google Maps వంటి అప్లికేషన్స్ వాడటం ద్వారా ప్రస్తుతం మీద ఉన్న లొకేషన్ మీ స్నేహితులకు చాలా సులభంగా
షేర్ చేయొచ్చు. అయితే ఇది పని చేయాలంటే తప్పనిసరిగా ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి. అన్ని సందర్భాల్లో మనకు
ఇంటర్నెట్ కనెక్షన్ లభించకపోవచ్చు. సరిగ్గా అలాంటప్పుడు ఉపయోగపడేదే ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్.
మామూలుగా మన ఫోన్ తో పాటు వచ్చే మెసేజెస్ అప్లికేషన్ లో కేవలం టెక్స్ట్ మెసేజ్ లు మాత్రమే పంపించడానికి
అవకాశం ఉంటుంది. వాటి ద్వారా లొకేషన్ షేర్ చేసుకునే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో మీ ఫోన్లో డీఫాల్ట్ గా
ఉండే మెసేజెస్ అప్లికేషన్ బదులుగా.. కొద్ది కాలం నుండి అందుబాటులోకి వచ్చినా రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్
(RCS) ప్రోటోకాల్ ఆధారంగా పనిచేసే అప్లికేషన్స్ వాడడం మంచిది.
ఉదాహరణకు గూగుల్ సంస్థ స్వయంగా Android Messages అనే అప్లికేషన్ని విడుదల చేసింది. ఇది RCS
ప్రోటోకాల్ ఆధారంగా పనిచేస్తుంది. దీని ద్వారా అన్ని రకాల మల్టీమీడియా కంటెంట్‌తో పాటు, ఇంటర్నెట్ కనెక్షన్
అవసరం లేకుండా నేరుగా లొకేషన్ వంటివి కూడా అవతల వారికి షేర్ చేసుకోవచ్చు.
గమనిక: Whatsappలో అన్ని లేటెస్ట్ Tech Updates కోసం
https://chat.whatsapp.com/EfkYnksROukEjBYCSVpelG అనే గ్రూప్‌లో జాయిన్ అవండి.
లేదా గమనిక: Telegramలో వాడేవారు లేటెస్ట్ Tech Updates కోసం https://t.me/technews_latest అనే ఛానెల్‌లో
జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.
దీనికోసం మీరు చేయవలసిందల్లా గూగుల్ ప్లే స్టోర్ నుండి.. Android Messages అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
దానికి కావలసిన అన్ని రకాల పర్మిషన్స్ వచ్చిన తర్వాత, దాన్ని మీ ఫోన్లో డిఫాల్ట్ ఎస్ఎంఎస్ అప్లికేషన్ గా సెట్
చేసుకోవాలి. ఆ తర్వాత Start Chat అనే బటన్ ని సెలెక్ట్ చేసుకొని, ఎవరికైతే ఎస్ఎంఎస్ పంపించాలి
అనుకుంటున్నారో వారి కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకొని, అక్కడే ఉండే ప్లస్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా, అక్కడ లభించే
మ్యాప్స్ ఆప్షన్ ఎంపిక చేసుకొని.. ఆ తర్వాత వచ్చే స్క్రీన్ లో Send this location అనే ఆప్షన్ ఎంపిక చేసుకోవాల్సి
ఉంటుంది. అది ప్రస్తుతం మీరు ఉన్న లొకేషన్‌ని మీకు ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా అవతల వాళ్ళకి షేర్
చేస్తుంది.
Comments
Post a Comment