
Whatsapp అప్లికేషన్లో తాజాగా ఒక లోపం వెలుగులోకి వచ్చింది. వాట్స్అప్ ద్వారా కేవలం ఒకే ఒక ఫైలు పంపించడం ద్వారా చాలా సులభంగా హ్యాకర్లు మీ ఫోన్లో ఉన్న ఫైల్స్ దొంగతనం చేయవచ్చు.
Android 8.1 నుండి Android 9 Pie ఆపరేటింగ్ సిస్టం ల మధ్య వెర్షన్లు వాడుతున్న ఫోన్లలో ఈ లోపం ఆధారంగా చేసుకుని హ్యాకర్లు డేటాను దొంగతనం చేయొచ్చు. దీనికి హ్యాకర్ చేయాల్సిందల్లా ఒక్కటే, ఒక ప్రమాదకరమైన GIF యానిమేషన్ ఫైల్ బాధితుడికి పంపిస్తే సరిపోతుంది. అవతలి వ్యక్తి అదే GIF ఫైల్‌ని గ్యాలరీ నుండి ఎంపిక చేసుకుని తన స్నేహితులకు ఫార్వార్డ్ చేయాలని భావించినపుడు ఆటోమేటిక్ గా బాధితుడి గ్యాలరీ లో ఉండే ఫోటోలు మొత్తం హ్యాకర్ యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది.
అయితే వాట్సాప్ సంస్థ ఈ లోపాన్ని సరి చేసే విధంగా తాజాగా దీనికి ఒక పరిష్కారం కనుగొని దానికి అప్డేట్ విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వాట్సాప్ వెర్షన్ 2.19.230 వరకు ఉన్న వెర్షన్స్ ఈ లోపం బారినపడే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ ఇప్పటికి మీ ఫోన్లో ఇలాంటి పాత వెర్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటి స్థానంలో వెంటనే లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోండి. అప్పుడు మాత్రమే పూర్తిస్థాయిలో ఈ లోపం నుండి మీరు రక్షణ పొందే అవకాశం ఉంటుంది.
రాబోయే కొద్ది నెలల్లో వాట్సాప్ సంస్థ అనేక కీలకమైన మార్పులు చేయటానికి ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా ఇప్పటి వరకు మొబైల్ నెంబర్ ఆధారంగా పనిచేస్తున్న వాట్స్అప్ సమీప భవిష్యత్తులో మొబైల్ నెంబర్ తో సంబంధం లేకుండా పూర్తి సపరేట్ ఐడితో పని చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టెలిగ్రామ్ మెసెంజర్ లో ఇప్పటికే ఈ తరహా సదుపాయం లభిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవేళ వాట్సప్ అదే మాదిరి మొబైల్ నెంబర్ తో సంబంధం లేకుండా పనిచేసే మెకానిజం గనుక తీసుకున్నట్లయితే కచ్చితంగా దాని వినియోగం మరింత శక్తివంతంగా మారుతుంది అనడంలో సందేహం లేదు.
లేదా గమనిక: Telegramలో వాడేవారు లేటెస్ట్ Tech Updates కోసం
https://t.me/technews_latest అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.
గమనిక: Whatsappలో అన్ని లేటెస్ట్ Tech Updates కోసం
https://chat.whatsapp.com/EfkYnksROukEjBYCSVpelG అనే గ్రూప్‌లో జాయిన్ అవండి.
Comments
Post a Comment