Skip to main content

Posts

Showing posts from November, 2019

పాస్వర్డ్ చెప్పాల్సిన పని లేకుండా మీ WiFi ఇతరులకి షేర్ చెయ్యడం ఇలా!

సహజంగా మీ ఇంటికి గానీ, ఆఫీస్‌కి గానీ  ఎవరైనా వచ్చినట్లయితే, లేదా మీ ఫోన్ లో వైఫై హాట్ స్పాట్ ఎనేబుల్ చేసి,  మీ ఫోన్లో ఉన్న ఇంటర్నెట్ ఇతరులకు షేర్ చేయాలనుకుంటే మన వైఫై పాస్వర్డ్ అవతల వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది కదా! అది గుర్తుపెట్టుకుని చెప్పాల్సిన పని లేకుండా,  దాన్ని వారు ఇతరులకు కూడా షేర్ చేయకుండా అడ్డుకోవాలంటే ఒక టెక్నిక్ ఉంది. ఇటీవల కాలంలో అధిక శాతం smartphoneలలో WiFi Settingsలో QR Code క్రియేట్  చేసుకోవటానికి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దానిని సెలెక్ట్ చేసుకుంటే మీ వై-ఫై నెట్వర్క్‌కి  సంబంధించిన SSIDతో పాటు దాని పాస్వర్డ్ కూడా ఒక QR Code రూపంలో తయారుచేయబడి స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతుంది.  దానిని అవతల వారికి చూపిస్తే సరిపోతుంది. లేదా అవతలి వాళ్ళకి షేర్ చేస్తే మీ పాస్వర్డ్ తెలియకపోయినా నేరుగా మీ వై-ఫై నెట్వర్క్‌కి వారు  కనెక్ట్ కాగలుగుతారు. ఒకవేళ మీ ఫోన్లో వైఫై సెట్టింగ్స్ లో కి వెళ్ళినప్పుడు ఇలాంటి ఆప్షన్ అనేది లేకపోతే, QR Code Generator అనే  ఆండ్రాయిడ్ అప్లికేషన్ గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని, దాన్ని ఓపెన్ చేసిన తర్వాత Te...

మీ phoneలోని ఫోటోలను ఆటోమేటిక్ గా ఎడిట్ చేయడం కోసం సూపర్ యాప్ వస్తోంది!

మన smartphone  కెమెరా ద్వారా మనం క్యాప్చర్ చేసుకునే ఫోటోలను ఎడిట్ చేయడం కోసం రకరకాల అప్లికేషన్లు గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని వాడుతూ ఉంటాం. అయితే ప్రముఖ ఫోటో ఎడిటింగ్ సంస్థ Adobe  ఒక శక్తివంతమైన అప్లికేషన్ తీసుకు రాబోతోంది. ఇది మనం క్యాప్చర్ చేసిన ఫోటోలను మన ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా అవసరమైన అడ్జస్ట్మెంట్ లు చేసి మెరుగ్గా కనిపించే విధంగా ఎడిట్ చేస్తుంది. Adobe  సంస్థ డెవలప్ చేసిన Adobe Sensei అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే టెక్నాలజీని ఉపయోగించి ఇది పనిచేస్తుంది. ఇప్పటికే అడోబ్ ఫోటోషాప్ లేటెస్ట్ వెర్షన్ వాడుతున్న వారికి అందులో Select Subject అనే  ఒక ప్రత్యేకమైన ఫీచర్ ప్రవేశపెట్టబడిన విషయం తెలిసిందే. ఒక ఫోటో లో ఉండే మనకు కావాల్సిన సబ్జెక్ట్ ను చాలా సులభంగా క్షణాల్లో సెలెక్ట్ చేసుకోవడం కోసం ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. గతంలో ఇలా సెలెక్ట్ తీసుకోవాలంటే ఫోటోషాప్ లో ఉండే అనేక టూల్స్‌తో  కుస్తీ పడాల్సి వచ్చేది. Photoshop Camera అని  పిలవబడే కొత్త అప్లికేషన్ దాదాపు జనవరి 2020 లో ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ఆపరేటింగ్ ...

Whatsappలో ఉన్న ఈ తాజా లోపం మీ ఫోన్లో ఫైల్స్ దొంగిలిస్తుంది!

Whatsapp అప్లికేషన్లో తాజాగా ఒక లోపం వెలుగులోకి వచ్చింది.  వాట్స్అప్ ద్వారా కేవలం ఒకే ఒక ఫైలు పంపించడం ద్వారా చాలా సులభంగా హ్యాకర్లు మీ ఫోన్లో ఉన్న ఫైల్స్ దొంగతనం చేయవచ్చు. Android 8.1 నుండి Android 9 Pie  ఆపరేటింగ్ సిస్టం ల మధ్య వెర్షన్లు  వాడుతున్న ఫోన్లలో ఈ లోపం ఆధారంగా చేసుకుని హ్యాకర్లు డేటాను దొంగతనం చేయొచ్చు. దీనికి హ్యాకర్  చేయాల్సిందల్లా ఒక్కటే, ఒక ప్రమాదకరమైన GIF యానిమేషన్ ఫైల్ బాధితుడికి పంపిస్తే సరిపోతుంది. అవతలి వ్యక్తి అదే GIF ఫైల్‌ని  గ్యాలరీ నుండి ఎంపిక చేసుకుని తన స్నేహితులకు ఫార్వార్డ్ చేయాలని భావించినపుడు ఆటోమేటిక్ గా బాధితుడి గ్యాలరీ లో ఉండే ఫోటోలు మొత్తం హ్యాకర్  యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. అయితే వాట్సాప్ సంస్థ ఈ లోపాన్ని సరి చేసే విధంగా తాజాగా దీనికి ఒక పరిష్కారం కనుగొని దానికి అప్డేట్ విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వాట్సాప్ వెర్షన్ 2.19.230 వరకు ఉన్న వెర్షన్స్ ఈ లోపం బారినపడే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ ఇప్పటికి మీ ఫోన్లో ఇలాంటి పాత వెర్షన్స్  ఏమైనా ఉన్నట్లయితే వాటి స్థానంలో వెంటనే లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకోండి...

ఇప్పుడు విండోస్ కంప్యూటర్ నుండి Android phone calls చేసుకోవచ్చు!

మీ దగ్గర ఉన్న Android phone   నోటిఫికేషన్స్ , ఎస్ఎంఎస్ మెసేజ్ లు ఇతర సమాచారం మొత్తాన్ని నేరుగా కంప్యూటర్ స్క్రీన్ మీద పొందటం కోసం అనేక అప్లికేషన్స్ మరియు గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్ కూడా లభిస్తుంది ఆ విషయం తెలిసిందే గూగుల్ కనెక్షన్స్ కూడా లభిస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో మైక్రోసాఫ్ట్ సంస్థ windows 10 ఆపరేటింగ్ సిస్టం కోసం Your Phone   అనే సదుపాయం కూడా కొంత కాలంగా అందిస్తోంది. దీని ద్వారా మీ ఫోన్లో మన ఫోటోలు , నోటిఫికేషన్స్ నేరుగా పిసిలో వైర్లెస్గా పొందొచ్చు.   అయితే ఈ రోజు తాజాగా మైక్రోసాఫ్ట్ సంస్థ Windows Insider program లో భాగంగా ఉన్న వారి కోసం ఒక అద్భుతమైన అప్డేట్ విడుదల చేసింది. దీనిని ఉపయోగించుకొని ఇకమీదట మీరు ఫోన్ చేతిలోకి తీసుకోవలసిన పనిలేకుండా   నేరుగా పీసీ నుండి ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు , అలాగే మీకు వచ్చిన ఫోన్ కాల్స్ ఆన్సర్ కూడా చేయొచ్చు. మీ కంప్యూటర్ లో ఉండే మైక్రోఫోన్ మరియు స్పీకర్ ఆధారంగా వాయిస్ వినిపిస్తుంది. ముఖ్యంగా హెడ్ ఫోన్స్ తగిలించుకొని కంప్యూటర్ లో సీరియస్ గా పనిచేస్తూ కూర్చునేవారు ముఖ్యమైన కాల్స్ మిస్సవకుండా ఉండటం కోసం ఈ సదుపాయం బా...

మీ phoneని పిసి రిమోట్‌గా ఇలా వాడండి!

మీ దగ్గర ఉన్న android phone ని   ఉపయోగించి మీ కంప్యూటర్ ని కంట్రోల్ చేసుకోవాలంటే అనేక అప్లికేషన్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్నిటి గురించి ఇప్పుడు చూద్దాం. Remote Mouse ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ల కోసం ఈ అప్లికేషన్ అందుబాటులో ఉంటుంది.   దీన్ని పూర్తి ఉచితంగా వాడుకోవచ్చు. https://remotemouse.net/ అనే వెబ్ సైట్ నుండి దీనికి సంబంధించిన సర్వర్   అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని మొదట మీ పీసీలో ఇన్స్టాల్ చేసుకోవాలి.   ఆ తర్వాత మీ ఫోన్లో దానికి సంబంధించిన క్లైంట్ అప్లికేషన్ను ఇన్స్టాల్ చేసుకుని మీ ఫోన్ మరియు pc ఒకే వై-ఫై నెట్వర్క్ కి కనెక్ట్ అయి ఉన్నప్పుడు , మీ పీసీని నేరుగా మొబైల్ ఫోన్తో కంట్రోల్ చేసుకోవచ్చు. లెఫ్ట్ మరియు రైట్ క్లిక్ ,   ఇతర ఆప్షన్లతో మీ కంప్యూటర్ నుండి నేరుగా మొబైల్ ఫోన్ నుండి ఈ అప్లికేషన్ ద్వారా నియంత్రించుకోవచ్చు. KiwiMote గూగుల్ ప్లే స్టోర్ లో బాగా పాపులర్ అయిన అప్లికేషన్ ఇది. విండోస్ , లైనెక్స్ , Mac ఆపరేటింగ్ సిస్టం లో కి సంబంధించిన కంప్యూటర్లను ఈ అప్లికేషన్ ద్వారా నేరుగా ఫోన్ తో కంట్రోల్ చేసుకోవచ్చు. కేవలం 2MB పరిమా...

మీ Android phoneలో అప్లికేషన్స్ దాచి పెట్టడం లేదా కంట్రోల్ చేయడం ఎలా?

మీ Android phoneలో అప్లికేషన్స్ దాచి పెట్టడం లేదా కంట్రోల్ చేయడం ఎలా? how to hide apps on android వివిధ కారణాల వల్ల మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్న అనేక రకాల అప్లికేషన్స్ ఇతరులకు కనిపించకుండా దాచి పెట్టాలి అనుకున్నా గానీ,  లేదా సంబంధిత అప్లికేషన్స్ ఓపెన్ కాకుండా బ్లాక్ చేయాలన్నా గానీ అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్నిటి గురించి ఇప్పుడు చూద్దాం. Calculator Vault గూగుల్ ప్లే స్టోర్ లో లభించే ఈ అప్లికేషన్ చూడటానికి ఒక మామూలు క్యాలిక్యులేటర్ అప్లికేషన్‌లా  కనిపిస్తుంది. అయితే దీంట్లో ఏదైనా అప్లికేషన్ మనం జత చేసినట్లయితే అది ఆటోమేటిగ్గా అదనంగా ఒక కాపీ క్రియేట్ అయ్యి ఇతరులకు కనిపించకుండా దాచి పెట్టబడుతుంది. ఆ తర్వాత బయట పబ్లిక్ గా కనిపిస్తున్న అప్లికేషన్ తొలగించుకోవచ్చు. కేవలం ముందే సెట్ చేసుకున్న పాస్వర్డ్ టైపు చేసిన వారు మాత్రమే ఇందులో హైడ్ చేయబడిన అప్లికేషన్స్ యాక్సెస్  చేయగలుగుతారు. ఈ లింక్ నుండి ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. Google Family Link ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్లను మానిటర్ చేయడం కోసం పేరెంట్స్ కోసం ఉపయోగపడే మంచి అప్లికేషన్ ఇది. గూ...

నెట్ లేకపోయినా మీ లొకేషన్ ఎవరికైనా పంపించాలంటే ఇలా!

Google Maps  వంటి అప్లికేషన్స్ వాడటం ద్వారా ప్రస్తుతం మీద ఉన్న లొకేషన్ మీ స్నేహితులకు చాలా సులభంగా షేర్ చేయొచ్చు. అయితే ఇది పని చేయాలంటే తప్పనిసరిగా ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి. అన్ని సందర్భాల్లో మనకు ఇంటర్నెట్ కనెక్షన్ లభించకపోవచ్చు. సరిగ్గా అలాంటప్పుడు ఉపయోగపడేదే ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్.  మామూలుగా మన ఫోన్ తో పాటు వచ్చే మెసేజెస్ అప్లికేషన్ లో కేవలం టెక్స్ట్ మెసేజ్ లు మాత్రమే పంపించడానికి అవకాశం ఉంటుంది. వాటి ద్వారా లొకేషన్ షేర్ చేసుకునే అవకాశం  ఉండదు. ఈ నేపథ్యంలో మీ ఫోన్లో డీఫాల్ట్ గా ఉండే మెసేజెస్ అప్లికేషన్ బదులుగా.. కొద్ది కాలం నుండి అందుబాటులోకి వచ్చినా రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ (RCS) ప్రోటోకాల్ ఆధారంగా పనిచేసే అప్లికేషన్స్ వాడడం మంచిది. ఉదాహరణకు గూగుల్ సంస్థ స్వయంగా Android Messages అనే  అప్లికేషన్ని విడుదల చేసింది. ఇది RCS ప్రోటోకాల్ ఆధారంగా పనిచేస్తుంది.  దీని ద్వారా అన్ని రకాల మల్టీమీడియా కంటెంట్‌తో పాటు, ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండా నేరుగా లొకేషన్ వంటివి కూడా అవతల వారికి షేర్ చేసుకోవచ్చు. గమనిక: Whatsappలో అన్ని లేటె...