Skip to main content

కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ బిల్లు వివరాలు

*కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొంది ఇప్పుడు చట్టంగా మారింది.*  
 
*ఈ అగ్రికల్చర్ బిల్లు -2020 లో ఏముందో ఒకసారి పరిశీలిద్దాం*

ఎంతసేపూ వాళ్ళూ వీళ్లు చెప్పింది వినడమే కాకుండా ఈ బిల్లు రైతులకు లాభం చేస్తుందా నష్టం చేసేలా ఉందా అని ప్రతి ఒక్క రైతు కూడా సొంతంగా ఆలోచించుకోవాలి. 
 
 ఈ కొత్త వ్యవసాయ బిల్లు గురించి పూర్తిగా అవగాహన పొందండి
 
🚫నిన్నటిదాకా ఉన్న రూల్స్ ప్రకారం రైతులు ధాన్యం తప్పనిసరిగా అయితే మార్కెటు కమిటీల అమ్మాలి లేకుంటె వాళ్ళ మండల పరిథిలో లేదా అదే జిల్లా పరిథిలో ఉండే ప్రయివేటు లేదా ప్రభుత్వ యార్డుల్లో మత్రమే అమ్ముకోవాలి అని చెప్తుండే . కానీ ఇప్పుడు అలాంటి రూల్స్ ఏం లేవు.
  
🚫 రైతులు పండించిన ధాన్యం మన రాష్ట్రం దాటద్దు , పక్క రాష్ట్రాలకు తీసుకుపోయేదుంటే మా ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టాలి, మధ్య మధ్యలో వచ్చే చెక్ పోస్టులు తప్పిచుకోడానికి వాల్లకు వీళ్లకు చేతులు తడపాలి అనే బాధల నుండి రైతులు ఇప్పుడు బయటపడ్డారు.
 
కొత్త వ్యవసాయ చట్టంతో రైతులకి ఎలాంటి లాభాలు ఉన్నాయో చూద్దాం:- 
 
✅ కొత్త వ్యవసాయ చట్టం ప్రకారం ఇకపై రైతులు తమ పంటలను ఎక్కడ నచ్చితే అక్కడ అమ్ముకోవచ్చు.  
 
✅ మార్కెటు కమిటీ ల మంచి రేటు ఉంటే మర్కెట్ ల అమ్ముకోవచ్చు (లేదా) ప్రయివేటు సేటు ఎక్కువ రేటు ఇస్తా అంటే సేటు కి అమ్మొచ్చు , (లేకుంటె) పక్కన ఇటు మహారాష్ట్రల - అటు కర్ణాటకల ఎక్కడ ఎక్కువ ధర ఉంది అంటే అక్కడికి ఒక పది మంది రైతులు జమ అయి ధాన్యం పట్టుకుపోయి మంచి రేటుకి అమ్ముకోవచ్చు.  
 
✅ నీ పంటను నువ్ వేరే రాష్ట్రం తీసుకొనిపోయి అమ్మలేవు అనుకుందాము. అలాంటప్పుడు ఎలెక్ట్రానిక్ విధానములో నువ్ నీ పంట ఫొటొ తీసి ఆన్ -లైన్ లో పెట్టి నాణ్యమయిన ఫలానా రకానికి చెందిన ఫలానా పంట నాదగ్గర ఇన్ని క్వింటాళ్లు రెడీగా ఉన్నయ్. క్వింటాలుకు ఈ రేటుకి అమ్ముతా అని ఆన్ -లైన్ లో పెడితే నువ్ పెట్టిన రేటు దేశం మొత్తం మీద ఎందరో చూస్తారు. నువ్ చెప్పిన ధర ఎవరికి తక్కువ రేటులా అనిపిస్తె వాళ్ళే మనదగ్గరికొచ్చి కొనుక్కుని వెళ్తారు. ఇది కూడా రైతుకి లాభమే కదా.... 
 
✅ నీ పంట నాణ్యత నచ్చితే రిలయన్స్ ఫ్రెష్ , వాల్ మార్ట్, హెరిటేజ్ లాంటి కంపెనీలు సైతం నేరుగా నీ పొలం వద్దకే వచ్చి నగద్ పైసలతో నీ ధాన్యం , నీ పండ్లు ఫలాలు,కూరగాయలను కొనుక్కుని పోతాయ్. నువ్ పండించే పంట నాణ్యత చాలా బాగా ఉంటున్నాయి అని అనిపిస్తే అవే కంపెనీలు రాబోయే పంటను మాకే అమ్మాలి అనో లేదా ఇన్ని క్వింటాళ్ల పంట మేము కొంటాం అని నీతో ముందస్తుగానే అగ్రీమెంటు చే సుకోడానికి కూడా ఇష్టపడతాయి. అంటే నువ్ పంట పండించే కంటే ముందే నీకు మంచి రేటు దొరికినట్టే కదా....  
 
📌 ఇక్కడ కొంతమంది రైతులని తప్పుదోవ పట్టించడానికి ఎం చెపుతున్నారంటే ప్రయివేటు కంపెనీలతో ముందస్తుగా అగ్రీమెంటు చేసుకుంటే భవిష్యత్తులో బయట మార్కెట్లో మద్దతు ధర బాగా ఎక్కువగా ఉన్నా కూడా అగ్రీమెంటు చేసుకున్న రైతులు యే రేటుకి ఇస్తం అన్నారో అదే రేటుకి పంట అమ్మి నష్టపోతారు అని రైతులను భయ పెడుతున్నారు. కానీ నిజానికి అలా మోసం చేయడానికి ప్రయివేటు కంపెనీలకు ఆస్కారం లేదు. అగ్రిమెంటు రాసుకునే సమయంలోనే అగ్రిమెంటులో మేము పంట కొనే సమయానికి ఉన్న మద్దతుధర లేదా అగ్రీమెంటు లో రాయబడిన ధరలలో ఏది ఎక్కువగా వుంటే ఆ ధర చెల్లించి మీ దగ్గర ఇన్ని క్వింటాళ్ల పంట కొంటాము అని కంపెనీలతో అగ్రీమెంటు చేసుకోవచ్చు.  
 
📌 ఇంకొకటి ఏం చెబుతారంటే ప్రయివేటు కంపెనీలు మీకు పెట్టబడి ఇచ్చి మీతో ఎక్కువగా పంట తీయించడానికి ఎక్కువగా ఎరువులు క్రిమిసంహారకాలు వాడించి మీ భూములలో సారాన్ని పీల్చి పిప్పి చేస్తాయి అని భయపెడతారు. రైతుసోదరులు గమనించాలి , ఏ కంపెనీ అయినా సరే రైతులకి పెట్టబడి ఇచ్చి ఇన్ని క్వింటాళ్ల పంట కొంటాము అంటాయి, లేదా నీకు ఇచ్చిన పెట్టబడి డబ్బులను నువ్ అమ్మే పంటల డబ్బులో పట్టుకుని నీకు మిగతా డబ్బులు ఇస్తాయి. అంతే కానీ కంపెనీలే నీకు కొంత డబ్బులు ఇచ్చేసి నీ భూమిలో వాళ్ళు వ్యవసాయం చేసి వాళ్ళ పంటలు వాళ్ళు పండించుకునే విదానం ఉండదు. ఒకవేళ అలాంటి కంపెనీయే ఉండి పొరపాటున వాల్లే నీ దగ్గరికి వస్తే కూడా నువ్ ఇయ్యకు కదా వాళ్లకి. నీ భూమి నీ ఇష్టం . నువ్ కంపల్సరీ ఇయ్యాలని కండిషన్ ఎం లేదు కదా..... 
 
📌 కొంత మంది చెపుతున్నట్టుగా ఈ బిల్లులో మార్కెట్ కమిటీలను మూసివేయాలి అనో లేదా మద్దతు ధర ప్రకటించడం బంద్ అయితదనో ఏం లేదు. దేశ వ్యప్తంగా ఏ పంటకు ఎంత మద్దతు ధర (MSP) ఉందో కేంద్రం ప్రకటిస్తూనే ఉంటది, ఆ రేటు నచ్చిన రైతులు ఆ రేటుకే అమ్ముకోవాలి అనుకుంటే మార్కెటు కమిటీలలో అమ్ముకొనే అవకాశం కూడా ఉంటది. ఈ ఫెసిలిటీని తొలగించడంలేదు. ఒకవేల మార్కెటు కమిటీలో ఉన్న మద్దతుధర నాకు నచ్చలేదు, నా పంట ను నేను పక్క జిల్లాలొ లేదా పక్క రాష్ట్రంలో అమ్ముకుంటా అనే వాళ్ళు మార్కేట్ కమిటీకి పోకుండా బయటికి పోయి దారిలో ఎవ్వరికి రుపాయి చలానా కట్టకుండా పంట అమ్ముకుని పైసలు తెచ్చుకునే ఛాన్స్ రైతులకి కల్పించింది కేంద్ర ప్రభుత్వం.

*✅ రెండవ బిల్లులో* : రైతులకి ప్రయివేటు కంపెనీలకి మధ్య జరిగిన అగ్రీమెంటుని నోటి మాటల మీద కాకుండా బాండ్ పేపర్ల మీద రాసుకోవాలి చెప్తుంది. ఒకవేల ఒక ప్రయివేటు కంపెని ఒక రైతుదగ్గర నుండి నువ్ పండిస్తున్న సన్న బియ్యంలో 200 క్వింటాళ్ల బియ్యం క్వింటాలుకు 1800 రూపాయల చొప్పున (లేదా) పంట దిగుబడి వచ్చే టైం కి ఉండే మద్దతు ధరలలో ఏది ఎక్కువగ ఉంటె ఆ రేటుకి కొంటాను అని అగ్రిమెంటు రాసిస్తే ఆ కంపెనీ తప్పనిసరిగా ఆ పంటను కొనాల్సివస్తుంది. ఒకవేల కంపెనీ కొనను అని మోండికేసినా లేక పంటను కొనుక్కుని కూడా 3 రోజులలోగా డబ్బులు రైతులకి ఇవ్వకున్నా కంపెనీకి 10 లక్షల రూపాయల పెనాల్టీ వేయబడుతుంది. ఇది రైతులకి కంపెనీలు చేసే మోసాల నుండి రక్షణ కల్పిస్తుంది. ఇలాంటి మోసాలు అధికంగా సీడ్ కంపెనీల వారి నుండి జరుగుతాయి. మా సీడ్ వెయ్యండి, పండిన ధాన్యం మేమే ఇంత రేటు తో కొంటాం అని చెప్పి తీరా పంట పండించినాక కొనరు. ఇలాంటి మొసాలు ఇకపై చెల్లవు.

Comments

Popular posts from this blog

1Apportunity viralpe Full details in Telugu

⭐ 1APPARTUNITY అంటే ఏమిటి?  ViralPe అనే హైదరాబాద్‌ స్టార్టప్‌ తయారుచేసిన రెండు మొబైల్‌ యాప్‌లలో ఒకటి 1Apportunity. ఇవి రెండు యాప్‌లు: 1. ViralPe App – స్థానిక షాపులు, వ్యాపారాలు కస్టమర్లను పొందడానికి 2. 1Apportunity App – యూజర్లు రోజూ చిన్న చిన్న పనులు చేసి డబ్బు సంపాదించడానికి ఈ యాప్ లక్ష్యం: సోషల్ మీడియా టైంను ఉత్పాదకమైన పనులుగా మార్చడం గ్రామీణ ప్రజలకు డిజిటల్ అవకాశాలు ఇవ్వడం ఉద్యోగ అవకాశాలు సృష్టించడం రిఫరల్ ద్వారా సంపాదించడానికి మార్గాలు ఇవ్వడం --- 🔵 Page 2 – వారు చెప్పిన సమస్యలు ఈ పేజీలో వారు నాలుగు ప్రధాన సమస్య들을 చెప్పారు: 1. Local Vendors కేవలం ఊర్లకే పరిమితం కావడం 70% షాపులు స్థానికంగానే ఉన్నా, ఆన్‌లైన్‌లో కనిపించవు. వాళ్లకు: డిజిటల్ యాప్స్ ఆన్‌లైన్ పేమెంట్స్ డెలివరీ సిస్టమ్స్ ఇవి అందుబాటులో లేవు. 2. దేశంలో ఉద్యోగాల కొరత ఉపాధి తగ్గడం GDP growth తగ్గించే ప్రధాన కారణం. 3. గ్రామీణ డిజిటల్ లిటరసీ తక్కువ గ్రామాల్లో చాలా మంది డిజిటల్ పద్ధతులకు సరిగ్గా అలవాటు కాలేదు. 4. సోషల్ మీడియా అలవాటు వల్ల సరైన పని లేమి మొబైల్ టైమ్ వృథా అవుతోంది. --- 🔵 Page 3 – వారి సొల్యూషన్ ఏమ...

ఇందిరమ్మ ఇల్లు పథకం (Indiramma Illu application status )

ఇందిరమ్మ ఇల్లు పథకం (Indiramma Illu application status )  ** ఇందిరమ్మ ఇల్లు పథకం ** అనేది తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక పథకం. ఇది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే నిరుపేద కుటుంబాలకు బహుళ అంతస్తుల ఇళ్లను అందించడం లక్ష్యంగా పెట్టుకుని రూపొందించిన పథకం. దీని ద్వారా ప్రజలు సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన నివాసాలను పొందవచ్చు. ఈ పథకం ద్వారా నిరుపేద ప్రజలకు మంచి నాణ్యమైన ఇళ్లను అందించడమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగాన్ని తగ్గించడం మరియు ఆర్థిక స్తోమతలను పెంచడం కూడా లక్ష్యం.  ఇప్పటివరకు, తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకం ద్వారా చాలామంది నిరుపేద కుటుంబాలు లబ్ధి పొందాయి మరియు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచుకుంటున్నారు. **ఇందిరమ్మ ఇల్లు పథకం** తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిరుపేద ప్రజల సంక్షేమానికి మద్దతునిచ్చే ముఖ్యమైన కార్యక్రమాలలో ఒకటి.  నిరుపేదలు, అట్టడుగు వర్గాలకు అందుబాటు ధరల్లో ఇళ్లు అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకం.. ఇక్కడ కొన్ని కీలక ఫీచర్లు ఉన్నాయి: 1. **ఆర్...

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి – Direct Link & పూర్తి వివరాలు

ఇంటర్ ఫలితాలు విడుదల TG: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రథమ సంవత్సరం (1st Year), ద్వితీయ సంవత్సరం (2nd Year) పరీక్షల ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కేకే గారు అధికారికంగా విడుదల చేశారు. విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ ఫలితాలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. 📊 మీ ఫలితాలు ఎలా చెక్ చేయాలి? మీ ఇంటర్ ఫలితాలను తెలుసుకోవడానికి క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి: క్రింది ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి మీ Hall Ticket Number నమోదు చేయండి Submit పై క్లిక్ చేయండి మీ ఫలితం స్క్రీన్ పై కనిపిస్తుంది 👉 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: [. click here for results ] 📌 ముఖ్య సమాచారం 1st Year & 2nd Year ఫలితాలు రెండూ అందుబాటులో ఉన్నాయి అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే చెక్ చేయండి ఫలితాలను PDF రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు 🎉 అన్ని విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు! మీ భవిష్యత్తు మరింత విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నాము.