✅🔷#PremaDesam మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రోజుల్లోనే, అలాంటి స్వచ్ఛమైన ప్రేమకథతో ఒక సినిమా చేయాలనే కల కలిగింది దర్శకుడు A. #Karunakaran కి. ఆ కలతో ఒక కథ రాసుకున్నాడు...!!
✅🔷చెన్నైలో ఎందరో ప్రొడ్యూసర్ల చుట్టూ తిరిగాడు. కానీ అందరూ రిజెక్ట్ చేశారు. అప్పుడు ఒక ఆలోచన — “హీరోని ఒప్పిస్తే ప్రొడ్యూసర్ ఆటోమేటిక్‌గా సెట్ అవుతాడు” అని హీరో వేట మొదలుపెట్టాడు. కానీ తన ఊహకు తగ్గ హీరో ఎవరూ కనిపించలేదు...!!
✅🔷ఒక రోజు చెన్నై పాండీ బజార్‌లో తిరుగుతుండగా ఒక తెలుగు సినీ మ్యాగజైన్‌లో కనిపించిన ఓ కవర్ ఫోటో అతని దృష్టిని ఆకర్షించింది. ఆ కవర్‌పై ఉన్న వ్యక్తి — Pawan Kalyan “ అచ్చం నా హీరోలానే ఉన్నాడే !” అనుకున్నాడు కరుణాకరన్. విచారిస్తే, అతను #Chiranjeevi తమ్ముడు అని తెలిసింది. విశేషం ఏంటంటే తనకి చిరంజీవి ఫేవరేట్ హీరో ...!!
✅🔷వెంటనే హైదరాబాద్ చేరుకుని, ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా పవన్‌ను కలిశాడు. అప్పటికి Suswagatham కూడా రిలీజ్ కాలేదు. రొటీన్ సినిమాలు చేయాలని ఇష్టం లేని పవన్, కొత్తదనం కోసం ఎదురు చూస్తున్న సమయం అది. కరుణాకరన్ చెప్పిన లవ్ స్టోరీ విన్న వెంటనే — “దీనికోసం ఎంత టైం అయినా వెయిట్ చేస్తా” అన్నాడు పవన్..!!
✅🔷తనతో ఆల్రెడీ గోకులంలో సీత మూవీ తీసిన G. V. G. రాజు ప్రొడ్యూసర్ . హీరోయిన్స్ కోసం యాభై మందికి పైగా ఆడిషన్ చేశారు. చివరికి తమిళ్ మూవీ Nandhini లో చూసిన Keerthi Reddy ని సెలెక్ట్ చేశారు...!!
✅🔷షూటింగ్ చెన్నై, హైదరాబాద్‌లో జరిగింది. తాజ్ మహల్ సెట్ వేసి బడ్జెట్ పెరిగింది. అప్పుడు పవన్ తన రెమ్యూనరేషన్‌లో అడ్వాన్స్ మాత్రమే తీసుకుని, మిగతాది వద్దన్నాడు. షూటింగ్ సమయంలో ఒక యాక్సిడెంట్ సీన్‌లో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు లోయలో పడిపోతే, పవన్ స్వయంగా కాపాడి రియల్ హీరోగా నిలిచాడు...!!!
✅🔷ముందుగా అనుకున్న టైటిల్ “కలవరమాయే మదిలో”. కానీ చివరికి పేరు మారింది — Tholi Prema. 1998 జూలై 24న సినిమా రిలీజ్ అయ్యింది..!!
సి✅🔷నిమా చూసిన ప్రేక్షకులు షాక్ అయ్యారు —
ఒక ప్రేమకథను ఇంత స్వచ్ఛంగా, ఇంత నీట్ గా, ఇంత అందంగా తీయొచ్చా ?
✅🔷స్వచ్ఛమైన ప్రేమకథ , సున్నిత భావోద్వేగాలు , మనసారా నవ్వుకునే కామెడీ, మదిని తొలిచే సంగీతం .. " అరే ఇలాంటి అమ్మాయి మన జీవితంలో ఉంటె బాగుండే, ఇలాంటి చెల్లి నాకుంటే ఎంత బాగుండు , ఫ్రెండ్స్ అంటే వీల్లేరా " అని అనుకోని అబ్బాయి ఉండడు..!!
✅🔷హీరో మన పక్కింటి కుర్రాడిలా కనిపించాడు. ప్రతి యువకుడు తనని తాను హీరోలో చూసుకున్నాడు. డ్యూయెట్స్ లేకుండా, ఫీమేల్ వాయిస్ లేకుండా, ఒక పెయింటింగ్‌లా సినిమా తీర్చిదిద్దిన కరుణాకరన్‌కు హాట్సాఫ్..👍❤️
అంతర్జాతీయ చిరంజీవి ఫెడరేషన్
#pawankalyan #powerstarpawankalyan #tholiprema #facebookpost2026シ
Comments
Post a Comment