వాట్సాప్‌లో కొత్త మోసం... 'ఘోస్ట్ పేయిరింగ్'తో జాగ్రత్త!
"హేయ్.. మీ ఫొటో చూశారా?" అంటూ ఏదైనా లింక్ వచ్చిందా? తెలిసిన వారి నుంచి వచ్చినా సరే.. పొరపాటున కూడా క్లిక్ చేయకండి.
ఇదొక 'ఘోస్ట్ పేయిరింగ్' (GhostPairing) స్కామ్.
ఆ లింక్ క్లిక్ చేస్తే నకిలీ వాట్సాప్ వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. ఓటీపీ గానీ, స్కానింగ్ గానీ లేకుండానే.. మీకు తెలియకుండా మీ వాట్సాప్ ఖాతా హ్యాకర్ల డివైజ్‌కు కనెక్ట్ అవుతుంది.
ఒక్కసారి వారి చేతికి చిక్కితే.. మీ వ్యక్తిగత చాటింగ్స్, ఫొటోలు, వీడియోలు అన్నీ చూస్తారు. మీ కాంటాక్ట్స్ లిస్ట్ దొంగిలిస్తారు. మీ పేరుతో ఇతరులకు సందేశాలు పంపి మోసాలకు పాల్పడతారు. చివరికి మీ ఖాతాను మీరే వాడలేకుండా లాక్ చేస్తారు.
✔️ అనుమానాస్పద లింక్‌లను అస్సలు క్లిక్ చేయవద్దు.
✔️ వాట్సాప్ సెట్టింగ్స్‌లో 'Linked Devices' ఆప్షన్‌ను తరచూ పరిశీలించండి. తెలియని డివైజ్‌లు ఉంటే వెంటనే రిమూవ్ చేయండి.
✔️ Two-step verification తప్పనిసరిగా ఎనేబుల్ చేసుకోండి.
ఒక చిన్న అజాగ్రత్తతో మీ వాట్సాప్ మొత్తం హ్యాకర్ల పరమవుతుంది. ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేసి అప్రమత్తం చేయండి.
Comments
Post a Comment