Skip to main content

కొత్త రేషన్ కార్డుల గందరగోళం

చొప్పదండికి చెందిన దండే మహేశ్‌ రేషన్‌కార్డులో భార్య, కుమారుడి పేర్లను చేర్చాలని ప్రజాపాలన సభలో దరఖాస్తు చేసుకున్నాడు. అత్తగారి ఇంటి రేషన్‌ కార్డు నుంచి భార్య పేరును తొలగించుకున్నాడు

చొప్పదండి యువకుడికి సిద్దిపేట జిల్లాలో కార్డు

- తప్పులను సరి చేయాలంటున్న లబ్ధిదారులు

చొప్పదండికి చెందిన దండే మహేశ్‌ రేషన్‌కార్డులో భార్య, కుమారుడి పేర్లను చేర్చాలని ప్రజాపాలన సభలో దరఖాస్తు చేసుకున్నాడు. అత్తగారి ఇంటి రేషన్‌ కార్డు నుంచి భార్య పేరును తొలగించుకున్నాడు. భార్య, కుమారుడి పేరుతో కొత్త రేషన్‌కార్డు వస్తుందనుకొని ఎదురు చూశాడు. ఆయనకు నిరాశే ఎదురైంది. కొత్త రేషన్‌ కార్డు గందర గోళంగా వచ్చింది. భార్యతోపాటు కుమారుడి పేరు గంగాధర మండలం గర్షకుర్తిలోని ఆయన భార్య పుట్టింటి కార్డులో చేరాయి. భార్యపేరును అక్కడికార్డులో తొలగించినప్పటికీ మారిన ఇంటి పేరుతో తిరిగి అదేకార్డులో నమోదు చేశారు. కుమారుడి పేరు కూడా గర్షకుర్తి లోని తన అత్తమామల కార్డులోకి చేరిపోయాయి. ఇలా చాలా మంది పేర్లు భార్య పుట్టింటి కార్డులోకి చేరాయి.

చొప్పదండి పట్టణానికి చెందిన రాజశేఖర్‌ రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా సిద్దిపేట జిల్లాలోని కోహెడలోని అత్తగారి కార్డులోకి మార్చారు.

చిట్యాలపల్లిలో తల్లిదండ్రుల పేర్లు లేకుండా మూడేళ్ల పాపకు రేషన్‌ కార్డు మంజూరు కాగా తల్లిదండ్రులు అధికారుల చుట్టూ తిరుగగా ముగ్గురిని కలుపుతూ కొత్త కార్డును పునరుద్ధరించారు.

చొప్పదండి, కార్డుల జారీలో గందరగోళం నెలకొంది. కొత్త, పాత కార్డులలో మార్పులు, చేర్పుల కోసం ప్రజాపాలనలో చాలా మంది దరఖాస్తులు చేసుకున్నారు. కొత్తగా వచ్చిన రేషన్‌ కార్డులో వివరాలు ఒక చోటుకి బదులు మరోచోట పేర్కొనడంతో లబ్ధిదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

చొప్పదండి మున్సిపల్‌ పరిధిలో 1200, మండలంలోని గ్రామాల నుంచి రెండు వేల మంది కొత్త, పాత కార్డులలో మార్పులు, చేర్పుల కోసం ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్నారు. అనేక సంవత్సరాల తరువాత రేషన్‌కార్డులు వస్తున్నాయని భావించిన వందలాది మందికి భంగపాటు తప్పలేదు. ఇటీవల కొత్త రేషన్‌కార్డులను జారీ చేస్తుండగా అనేకమంది కార్డులు గందరగోళంగా వచ్చాయి. కథ మళ్లీ మొదటికి రాగా ప్రజలు తిరిగి కార్డులను సవరించాలని కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పెళ్లైన మహిళలు తమ పేర్లను అత్తారింటికి మార్చాలని దరఖాస్తులు చేసుకోగా సీన్‌ రివర్స్‌ అయ్యింది. భార్య అత్తారింటికి బదులుగా భర్తలను అత్తగారి కార్డుల్లోకి చేర్చారు. కొందరి రేషన్‌ కార్డులో జిల్లాలు కూడా మారిపోయాయి.

 ఆధార్‌ అనుసంధానంతో గందరగోళం

ప్రజాపాలనలో రేషన్‌ కార్డుల దరఖాస్తులు చేసుకోవడానికి గ్రామ పంచాయతీలలో ప్రత్యేకఏర్పాట్లు చేశారు. దరఖాస్తులను గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణంలో మున్సిపల్‌ సిబ్బంది ఆధార్‌ నంబర్‌తో లాగిన్‌లో అప్లోడ్‌ చేశారు. రేషన్‌కార్డులకు ఆధార్‌ అనుసంధానంతో అక్కడి కార్డులు ఇక్కడ, ఇక్కడి కార్డులు అక్కడ వచ్చినట్లు తెలుస్తోంది. భార్య ఆధార్‌ నంబర్‌ను లాగిన్‌లో అప్‌లోడ్‌ చేయగానే పాతకార్డుకు అనుసంధానమైనట్లు చెబుతున్నారు. గతంలో రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో దరఖాస్తులను అప్‌లోడ్‌ చేయగా ఎలాంటి తప్పులు జరుగలేదు. కాగా రేషన్‌కార్డులు అత్తగారి ఇంటికి మారడంతో కొందరు రాజీవ్‌ యువ వికాసం పథకానికి అర్హత కోల్పోయారు. రేషన్‌ కార్డులో తప్పుల కారణంగా యువవికాసం పథకానికి దరఖాస్తు చేసు కోలేకపోయారు. తమ కార్డులో తప్పుల సవరణల కోసం లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వెంటనే తమ కార్డులను సవరించాలని కోరుతున్నారు

Comments

Popular posts from this blog

1Apportunity viralpe Full details in Telugu

⭐ 1APPARTUNITY అంటే ఏమిటి?  ViralPe అనే హైదరాబాద్‌ స్టార్టప్‌ తయారుచేసిన రెండు మొబైల్‌ యాప్‌లలో ఒకటి 1Apportunity. ఇవి రెండు యాప్‌లు: 1. ViralPe App – స్థానిక షాపులు, వ్యాపారాలు కస్టమర్లను పొందడానికి 2. 1Apportunity App – యూజర్లు రోజూ చిన్న చిన్న పనులు చేసి డబ్బు సంపాదించడానికి ఈ యాప్ లక్ష్యం: సోషల్ మీడియా టైంను ఉత్పాదకమైన పనులుగా మార్చడం గ్రామీణ ప్రజలకు డిజిటల్ అవకాశాలు ఇవ్వడం ఉద్యోగ అవకాశాలు సృష్టించడం రిఫరల్ ద్వారా సంపాదించడానికి మార్గాలు ఇవ్వడం --- 🔵 Page 2 – వారు చెప్పిన సమస్యలు ఈ పేజీలో వారు నాలుగు ప్రధాన సమస్య들을 చెప్పారు: 1. Local Vendors కేవలం ఊర్లకే పరిమితం కావడం 70% షాపులు స్థానికంగానే ఉన్నా, ఆన్‌లైన్‌లో కనిపించవు. వాళ్లకు: డిజిటల్ యాప్స్ ఆన్‌లైన్ పేమెంట్స్ డెలివరీ సిస్టమ్స్ ఇవి అందుబాటులో లేవు. 2. దేశంలో ఉద్యోగాల కొరత ఉపాధి తగ్గడం GDP growth తగ్గించే ప్రధాన కారణం. 3. గ్రామీణ డిజిటల్ లిటరసీ తక్కువ గ్రామాల్లో చాలా మంది డిజిటల్ పద్ధతులకు సరిగ్గా అలవాటు కాలేదు. 4. సోషల్ మీడియా అలవాటు వల్ల సరైన పని లేమి మొబైల్ టైమ్ వృథా అవుతోంది. --- 🔵 Page 3 – వారి సొల్యూషన్ ఏమ...

ఇందిరమ్మ ఇల్లు పథకం (Indiramma Illu application status )

ఇందిరమ్మ ఇల్లు పథకం (Indiramma Illu application status )  ** ఇందిరమ్మ ఇల్లు పథకం ** అనేది తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక పథకం. ఇది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే నిరుపేద కుటుంబాలకు బహుళ అంతస్తుల ఇళ్లను అందించడం లక్ష్యంగా పెట్టుకుని రూపొందించిన పథకం. దీని ద్వారా ప్రజలు సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన నివాసాలను పొందవచ్చు. ఈ పథకం ద్వారా నిరుపేద ప్రజలకు మంచి నాణ్యమైన ఇళ్లను అందించడమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగాన్ని తగ్గించడం మరియు ఆర్థిక స్తోమతలను పెంచడం కూడా లక్ష్యం.  ఇప్పటివరకు, తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకం ద్వారా చాలామంది నిరుపేద కుటుంబాలు లబ్ధి పొందాయి మరియు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచుకుంటున్నారు. **ఇందిరమ్మ ఇల్లు పథకం** తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిరుపేద ప్రజల సంక్షేమానికి మద్దతునిచ్చే ముఖ్యమైన కార్యక్రమాలలో ఒకటి.  నిరుపేదలు, అట్టడుగు వర్గాలకు అందుబాటు ధరల్లో ఇళ్లు అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకం.. ఇక్కడ కొన్ని కీలక ఫీచర్లు ఉన్నాయి: 1. **ఆర్...

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి – Direct Link & పూర్తి వివరాలు

ఇంటర్ ఫలితాలు విడుదల TG: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రథమ సంవత్సరం (1st Year), ద్వితీయ సంవత్సరం (2nd Year) పరీక్షల ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కేకే గారు అధికారికంగా విడుదల చేశారు. విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ ఫలితాలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. 📊 మీ ఫలితాలు ఎలా చెక్ చేయాలి? మీ ఇంటర్ ఫలితాలను తెలుసుకోవడానికి క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి: క్రింది ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి మీ Hall Ticket Number నమోదు చేయండి Submit పై క్లిక్ చేయండి మీ ఫలితం స్క్రీన్ పై కనిపిస్తుంది 👉 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: [. click here for results ] 📌 ముఖ్య సమాచారం 1st Year & 2nd Year ఫలితాలు రెండూ అందుబాటులో ఉన్నాయి అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే చెక్ చేయండి ఫలితాలను PDF రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు 🎉 అన్ని విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు! మీ భవిష్యత్తు మరింత విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నాము.