క్యారెట్ హల్వా
కావాల్సిన పదార్థాలు:-
1.క్యారెట్స్
2.నెయ్యి
3.పాలు
4.చక్కెర
5.డ్రై ఫ్రూట్స్
తయారీ విధానం :
ముందుగా క్యారెట్స్ ని శుభ్రంగా కడిగి తురుముకోవాలి.
తర్వాత స్టౌ వెలిగించి పాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
అదే పాన్ లో మరొక స్పూన్ నెయ్యి వేసి క్యారట్ తురుము వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ,
తర్వాత కాచిన పాలను పోసి చక్కెర వేసి బాగా ఉడికించాలి. తర్వాత ఒక స్పూన్ నెయ్యి ,
వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్ వేసి గిన్నెలోకి తీసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే నోరూరించే క్యారట్ హల్వా రెడీ.






Comments
Post a Comment